.bmp)
మనకి వారసత్వ సంపదగా వచ్చేవి చాలా సామెతలున్నాయి.అలాగే కొంచం లౌక్యంగా తిట్టే తిట్లు కూడా ఉన్నాయి.అందులో ఒకటి ధనియాల జాతి అనేది ఒకటి.ఇది తిట్టో పొగడ్తో దాని అర్ధం తెలిస్తే కాని తెలీదు, అందుకని ఆవిడ ఆయన పక్కవార్నో,ఆయన ఆవిడ పక్కవారినో దెప్పడానికి బహు చక్కగా ఉపయోగిస్తారు.
అలాంటి ధనియాలు చల్లితే సువాసనలు వెదజల్లుతూ మన ఆరోగ్యానికి మంచిచేసే కొత్తిమీర మొలకెత్తుతుంది.
సరే ప్రస్థుతానికి వస్తే ఈ ధనియాల జాతికి చెందిన ఓ వ్యక్తి ని విత్తనంగా చల్లితే మొలకెత్తిన కొత్తిమీర సువాసనే ప్ర.పీ.స.స.
అయితే ఏంటంటా?
అబ్బే ఏమీ లేదూ కొన్ని విషయాలు తెలియని వారికి తెలియచెయ్యడం వల్ల ఇంకొన్ని లాభాలు కూడా ఉంటాయి కదా మరి. అందుకన్నమాట.
అలా మొలకెత్తిన కొత్తిమీర సువాసన వ్యాపించి విస్తరించి కొన్ని సహాయక చర్యలూ చేస్తోంది(ఈ కొత్తిమీర తింటే మన శరీరానికి ఎంత ఆరోగ్యమో అలా సమాజ హితవుకోసమన్నమాట).అందులో భాగంగా చంద్రునికో నూలు పోగులాగ ఇద్దరు ఆర్ధికంగా వెనకబడ్డ పిల్లల చదువులకు అర్ధిక సహాయాని అందించింది ఇదే సంవత్సరం. దానికి కొనసాగింపుగా ఒక స్కూల్ నిర్మాణంలో పాలుపంచుకుంటోంది (వారి ఆలోచనలతో, మేధస్సుతో, చేతనయిన ఆర్ధిక సాయంతో).
ఒక వ్యక్తి మంచివారా చెడ్డవారా(ఇది ఆయా మనుష్యుల ఆలోచనా సరళిని బట్టి,కాలమాన పరిస్థితులని బట్టీ కూడా ఉండచ్చు) అన్నది పక్కన పెడితే అటువంటి వ్యక్తి ఇటువంటి ఆలోచనకి అంకురం అయినందుకు అభినందిస్తూ, ఈ కొత్తిమీర లాంటి ప్ర.పీ.స.స ఇటువంటి మంచి కార్యాల్ను ఇంకా ఎన్నెన్నో చెయ్యాల్ని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ...
కొన్ని సంగ్రహించిన మంచిమాటలు :
ఒక సమస్య వల్ల మనకి నష్టం కలిగించవచ్చు.కానీ దాని వల్ల ఒక మంచి కూడా జరుగుతుంది. ఎలుకలు బొద్దింకలు బాక్టీరియా వైరస్ ఇలాంటివన్ని కీడూ చేసేవే.కానీ క్రిమిసమ్హారక మందులు, రోగనిరోధక టీకాలు చివరికి ఎలుకల బోనులు తయారుచేసేవారి ఉపాధి కూడా దీని మీదే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అన్నాడు సోక్రటీస్.తత్వానికి పరాకాష్టయిన ఈ స్టేట్ మెంట్ చాలా చేదు సత్యం.
ప్రపంచంలో మనిషికి కీడు చేసే ఈ ప్రాణులే లేకపోతే కొన్ని కోట్ల మంది నిరుద్యోగులవుతారు.చివరికి మరణం కూడ ఓటమి కాదు.ఒక మనిషి మరణం ఒక కాటికాపరిని,ఒక కట్టెలు అమ్మేవాడ్ని పోషిస్తుంది అన్న విషయం తెల్సుకుంటే ప్రతీ సమస్యకీ ఏదో ఒక లాభముండే తీరుతుందన్న సత్యం బోధపడుతుంది.
ఒక మాట...ఒక స్పర్శ..స్నేహపురస్కారంగా ఒక సానుభూతి..మనిషి మనిషికీ మధ్య ప్రేమా, ఆప్యాయతా, కరుణతో కంటినిండా చిప్పిల్లిన నీళ్ళూ మనసునిండా సంతృప్తి...విషాదానికీ ఆనందానికీ తేడాలేకపోడం... ఇంతకన్నా ఏమి కావాలి జీవితానికి? డబ్బు,పదవి,రికమండేషన్లు మెటీరియలిస్టిక్ దృక్పధం...రోజువారీ జీవితం...మనిషి మనిషికీ మధ్య ఉండే బంధంతో పోల్చుకుంటే ఇవి ఏపాటివి?
పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే.పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే,దీనికి మాటలఖ్ఖరలేదు, సాన్నిహిత్యం చాలు.
చివరిగా...ఒక మనిషి కష్టం లో ఉంటే ఆదుకోడానికి ప్రాణస్నేహమే అక్కర్లేదు,మమూలు స్నేహం చాలు,ఇంకా ఎదగగలిగితే మానవత్వం చాలు.







