
సెలవలకి ఊరొచ్చిన పవిత్రపాపి చికాగో(ఉరఫ్ సూర్యాపేట)శరత్ బేంకుకెళ్ళి లావాదేవీలు చూసుకుని కొంత సొమ్ము తెచ్చుకుందామని వెళ్ళాడు.ఊరుచూసి చాలా రోజులయింది కదా అని సరదాగా నడుచుకుంటూ వెళ్ళాడు.ఏమిటో అంతా చాలా మారిపోయినట్టుంది అన్నీ కొత్త కొత్త షాపులూ, మాల్సూ వచ్చేసాయి,స్వరూపమే మారిపోయింది,ఇంతలో ఎవడో ఏంది బే కళ్ళు దొబ్బాయా రోడ్డు మీద నడస్తన్నావ్ ఇండ్ల సెప్పొచ్చినావా బిడ్డా అనుకుంటూ ఒక్క జెల్ల పీకి మరీ స్కూటర్మీదెళ్ళి పోయాడు. ఆవెనకే కారు మేఘం కమ్మేసినట్టు నల్లటి పొగ కాసేపు ఆ చోటంతా కప్పేసింది,శబ్దం పొగా తప్పా ఇంకేమీ కనపడ్లా వినపడ్లా.కాసేపయ్యాక చూసుకుంటే తను చక్కగా ఫుట్‌పాత్ మీదే ఉన్నాడు మరి వాడెందుకు అలా జెల్లపీకెళ్ళాడు ప్చ్ హేవిటో ఊరు మారిందనుకున్నా మన హైడ్రా"బేడ్" ఏమ్మారలే హమ్మయ్య అనుకుంటూ ముందుకెళ్ళాడు.ఇంకొంచం ముందుకెళ్ళాక నెత్తిమీద కుండలతో నీళ్ళు కుమ్మరించేసినట్టయింది ఉలిక్కిపడి చూస్తే మున్సిపాలిటీ నీళ్ళ టేంకర్ నీళ్ళన్ని వొంపుకుంటూ కుదుపులతో వేగంగా వెళ్తోంది.అంతే మొత్తం తడిసిపోయాడు ఏ వర్షం కురవకుండానే మళ్ళీ ఇంటికెళ్ళి ఏమి వస్తాములే అని అల్లాగే ముందుకు కదిలాడు.
సరిగ్గా బేంకు దాకా వెళ్ళాడు అన్యాపదేశంగా మెట్లెకబోయి తలపైకెత్తి చూసాడొసారి.అంతే ఉలిక్కి పడ్డాడు. ఇదేంటిది "ఆంధ్రా బేంక్"అని కదా ఉండాలి ఇక్కడ కానీ “తెలంగాణా బేంక్” అని రాసి ఉందేవిటీ. అనుమానమొచ్చింది అడ్రస్ కరక్టే ఇంతకు ముందు చాల సార్లు వచ్చాడు కూడా మరి ఇదేమిటీ అనుకుంటూ మెట్లెక్కి ద్వారం దగ్గర వాచ్‌మేన్ ని అడుగుదామనుకుని చూస్తే అతను ఇంకో పక్క బిల్డింగ్ వాచ్‌మేన్ తో కల్సి కేసీఆర్ గురించి ముచ్చట్లాడుకుంటుండ్రు.సరే అని ఏటీఏం దగ్గరికెళ్ళి కార్డ్ పెట్టి పిన్ నంబర్ నొక్కేంతలో పుసుక్కున వెనక్కొచ్చి మొహానికి తగిలిందా కార్డ్.చూస్తే స్క్రీన్ మీద మెసేజ్ "ఏంది బిడ్డా ఆంధ్రా బేంకి కార్డ్ దీని బొక్కల్‌పెడ్తావ్ బే త్తియ్ దీన్ తల్లి" అంటూ… జీవితంలో మొదటిసారి భయ మేసింది శరత్తుకి, ఎందుకయినా మంచిదని బేంకు లోపలికెళ్ళి కనుక్కుందామని వెళ్ళాడు.లోపలంతా గజిబిజీగా ఉంది కష్టమర్లు తక్కువా గోలెక్కువా అన్నట్టు. కష్టమర్లకంటే ఉద్యోగులే ఎక్కువున్నారు.సరే ఒక కౌంటర్ దగ్గరికెళ్ళి ఏంటి సార్ నా కార్డు ఏటీఎం లో పెడితే ఇలా అంటోంది అంటూ తన బాధ వెళ్ళగక్కాడు. అంతే ఆ సీట్లో కూర్చున్నవాడమాంతం లేచి "దిమాక్ గట్రా ఖరాబైందా ఏం,ఎట్ల పనిచేస్తది వాయ్ ఇది,ఏవూర్ బిడ్డా నీద్ బయట పేర్ చదవలేదె” అంటూ కార్డిసిరి కొట్టాడు.దెబ్బకి బుర్ర తిరిగిపోయింది మనోడికి.అల్లంత దూరాన పడ్డ కార్డు తీసుకుని మేనేజర్ని కల్వనికి బోయిండు. బయటనించి అద్దాల గదిలోకి చూసాడోసారి మాంచి హుషారుగా ఫోన్ల మాట్లాడుతూండు మానేజర్అటుపక్కతిరిగి. అతని వెనకాల గోడమీద కేసీఆర్ ఫొటో తగిలించి ఉంది,దానికి దండ కూడా వేసి ఉంది అదేంటి కేసీఆర్ బ్రతికే ఉన్నాడుగా అన్నాళ్ళు తాగకుండా ఉన్నా కూడా, ఉలిక్కి పడ్డాడు ఎందుకలా వేసారో తెలీక. మానేజర్ తెల్సినోడి లెక్కుంటే మళ్ళీ చూసాడు నిజమే అతను ఏకలింగం,అరే అన్నా ఏకలింగం అనుకుంటా పోబోతే లోపలికెళ్ళబోతే ఇంతెజార్ కర్ బే అన్నట్టుగా సైగ చేస్తే బయటే కూర్చుని ఆ పక్కనే ఉన్న పేపర్ చూస్తుంటే మొదటి పేజీలో కేప్షన్ ఆకర్షించింది." తెలంగాణా వచ్చుడో కేసీఆర్ చచ్చుడో" తేదీ చూసాడు, కొన్ని రోజుల వెనకది.అప్పుడు వెలిగింది ఆ కేప్షన్ ఎందుకు పెట్టారో లోపల ఫొటో కింద, చిన్నగా నవ్వుకున్నాడు.
సరే మళ్ళీ లేచి చూసేసరికి లోపలికి రమ్మనమని సైగచేసాడు మానేజర్ ఏకలింగం. హమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్ళి జరిగిందంతా చెప్తుండగానే ఏకలింగం అరే శరతన్నా ఓలొల్లిసేయమాక నీకు తెల్దల్లే ఉంది ఇప్పుడు మాకూ సొంతత్రం వచ్చింది రాకపోయిన సరే మేం తీసుకుంటం, అందుకు నువ్వు అన్నీ మూసుకుని ఆ మట్ని కూకో, ఇకపై ఈ బేంక్ తెలంగాణా బేంకనే నడుస్తాది అందుకని ఈ ఆంధ్రా బేంకీల ఉన్న ఖాతాలన్నీ బేషరతుగా రద్దయిపోతయ్,అందల ఉన్న సొమ్మంతా మా బేంకిల్ జమయిపోద్ది వాటోమేటిగ్గా,ఎందుకంటే ఈ హైదరబాద్ మాదె కదా మరప్పుడు అందల ఉన్న ఆంధ్ర బేంక్లన్నీ తెలంగాణ కిందకి వచ్చినయ్ కందా అందుకన్నమాట. మరేమో మీ ఆంధ్ర బేంకి పేర్లున్న కార్డులు కాని,చెక్కులు కాని దాని బుక్కులు కాని ఆ మాట్ని రద్దయినట్టే.ఇది మా కేసీఆర్ సెప్పిండు (ఆయనకి సోనియమ్మ సెప్పిందట) మావ్ ఆచరించినం. అందుకని నువ్వేమాత్రం లొల్లి సెయ్యకుండ సప్పున బయటకురుకు బిడ్డా లేకపోతే నీ పేరు కూడా తెలంగాణ శరత్తని మారుస్త గదెవడ్రా అకడ గిట్లరారాదె అంటుండగానే మనోడు ఎందుకొచ్చిన గోలని అదేపనిగ బయటికురికినాడు.
గింతలో బేంకిబయట రౌడీ ఎవరికో బీటెయ్యడానికిమల్లె తచ్చాడుతుండె, శరత్తుని చూసి అన్నా ఇక్కడున్నవేందే అనగానే రౌడీని కాగలించుకుని గొల్లుమన్నాడు.జరిగిందంతా చెప్పాడు.
అప్పటికే రౌడీకి బాగా కాల్తంది ఒక్క బస్సు ఆగదు,అవతల కేండిడేట్ వెయిటింగూ దానికితోడు వచ్చే బస్సులన్నీ ఏపీ ని టీజీ అని మార్చిఉన్నాయి,ఎక్కడికెళ్తాయో అంతా అయోమయంగా ఉంది ఇంతలో శరత్తొచ్చి ఇలా చెప్పగానే రౌడీ కి ఎక్కడో కాలింది
బస్సెనక బస్సు వచ్చె,
పదహారు బస్సులొచ్చె,
ఏ బస్సులాగవ్ కొడకో,
నేనెట్ట పోయెది శరతో... అంటూ పాటందుకున్నాడు.
ఎహే నీయబ్బ ఇల్లు కాలి నేనేడుస్తుంటే చుట్టపీక్కి నిప్పడుగుతున్నట్టుందిబే అని శరత్తొక్కటిచ్చాడు రౌడీ కి.రౌడీ తక్కువోడా అసలే రౌడీ అందులో బాగా కాలి ఉన్నాడు తనూ ఒక్కటిచ్చాడు పెద్దోడని కూడా చూడకుండా.ఇలా కొట్టుకుంటుంటే జనాలు చూసి ఆంధ్రోడ్ని కొడతన్నాడని తెలంగాణోళ్ళు, తెలంగాణోడ్ని కొడతన్నాడని ఆంధ్రోళ్ళు జట్లు కింద విడిపోయి కొట్టుకోడం మొదలెట్టారు.మరి మీడియా హంగామా మొదలయ్యింది ఇంతలో బకరా దత్తా వచ్చింది మైకట్టుకుని వీళ్ళిద్దరి మధ్యలోకీ దూరిపోతూ,పడిపోతూ సెయ్యడ్డెట్టి మొదలెట్టింది ప్రశ్న మీద ప్రశ్న. రౌడీ జుట్టేగరేసుకుంటూ జవాబు చెప్పా ఒకటి పీకా,మళ్ళీ శరత్తు వంతు రౌడీ పీకేసిన జుట్టు సర్దుకుని తనూ అదే పని చేసాడు మధ్య మధ్యలో బక్రాని ఓరకంట చూస్తా. ఇలా సాగుతుంటే అప్పుడే అటేపునించి వెళ్తున్న బస్సులోంచి నాగ చూసాడు ఈ గొడవ,కొట్టుకుంటూ వీళ్ళిద్దరూ కనిపించారు(బక్రా కోసం అనుకున్నాడు)వెంటనే గుర్తొచ్చింది ఏకలింగం మొబయిలు నంబరుకి ఒక్క నొక్కు నొక్కి,నీయబ్బా చూడుబే మనోళ్ళిద్దరూ నీ బేంకుబయట కొట్టుకుంటన్నారు నువ్వేం పీక్తన్నవ్ అంటూ దొబ్బులెట్టాడు. వెంటనే ఏకలింగం బయటికొచ్చి వాళ్ళిద్దర్నీ విడదీసి సర్దిచెప్పి లోపలికి తీసుకెళ్ళబోయాడు. ఇంతలో నాగ ముందు స్టాప్ లో బస్ దిగి పరిగెత్తుకొచ్చాడు.
మొత్తానికి ఏదో సర్దిచెప్పి లోపలికి తీసుకెళ్ళి ఓ కూల్‌డ్రింకు తాగించి ఇద్దర్నీ శాంతింపచేసాడు. ఇంతలో ఎవరో తలుపు మీద తట్టిన శబ్దం అందరూ అటేపు చూసారు రాయలసీమ జెండా చొక్కా కుట్టించుకుని కొత్తపెళ్ళికొడుకు యోగి లోపలికి వస్తూ చెప్తున్నాడు అన్నా చూసారా ఎలా ఉంది నా షర్ట్ డిజైను మన నాగదే డిజైన్ క్రెడిట్ అంటూ...శరత్ చేతిలో కూల్‌డ్రింకు సీసా జారింది వెంటనే భళ్ళున శబ్దం…
చప్పున తెలివొచ్చేసింది నాకు…చూస్తే మొబయిలు రింగవుతోంది బాస్ కాల్ చేస్తున్నాడు ఏంటి తలుపులేసుకుని మరీ నిద్రపోతున్నావు అంటూ రౌండేస్తున్నాడు...
గమనిక:- ఇది సరదాకి రాసిందే తప్ప ఎటువంటి రాజకీయ సామాజిక దురుద్దేశాలూ లేవని, మిత్రులెవరూ తప్పుగా అర్ధంచేసుకోవద్దని మనవి,విన్నపం వగైయిరా వగైయిరా...
మొన్నటి గొడవల్లో "ఆంధ్రా బేంకు ఎటిఎం" పేరు "తెలంగాణా బేంకు ఎటిఎం"గా మార్చి రాసిన ఉదంతం కోసం ఈ కింద లింకు చూడండి…
http://www.suryaa.com/main/showDistricts.asp?subCat=12&ContentId=47024.
17 వ్యాఖ్యలు:
మేష్టారు, రాజకీయాలను పక్కన పెట్టి, హాయిగా నవ్వుకున్నాను!!
కడుపుబ్బ నవ్వుకున్నాను. దయచేసి అందరూ దీనిని సరదాగానే చూడండి తప్ప సీరియస్ గా తీసుకోవద్దు.
చాలా బాగా వ్రాశారు, చివరకు తెలబాన్లు కూడా నవ్వు ఆపుకోలేనట్ల్లు :)
బస్సెనక బస్సు వచ్చె,
పదహారు బస్సులొచ్చె,
ఏ బస్సులాగవ్ కొడకో,
నేనెట్ట పోయెది శరతో.. హ హ హ :) :) :)
మొత్తం మా కెబ్లాస సభ్యులందరినీ కూడా ఇరికించేశారుగా. అయితే త్వరలో మిమ్మల్ని కూడా కెలకాల్సిందే. :) :) :)
:)) ఇప్పుడే లేచిన. మల్లొస్తా. మీ అందరి సంగతి జూస్తా.
మీ వుద్దేశం ఏమైనా నాకు చాలా రాజకీయోద్దేశాలు, జకీయోద్దేశాలు, కీయోద్దేశాలు .. ఎటెసెట్రా .. అన్నీ కనిపిస్తున్నాయి!!
good one
:)
:))
అరె! ఇదేంది పప్పన్నా! ఈ దినాం గిట్ల షురు జేసినవ్.. కలయినగాని .. శరతన్న, మలకన్న, అందరు గిట్ల ఈడకొస్తే ఎట్లుంటదో సూడాలని మనసయితాంది... మస్తు జెప్పినవ్ గాని మనమే ఎండ కా చత్రి పట్టాలే గప్పుడే ఈడ బతగలమని పెద్దొల్లు షురు జేసిన్రు :)
****
నేను కూడా సరదాగా రాసాను బాగుంది పప్పుగారు కాసేపు హాయిగా నవ్వుకున్నాను గొడవలకతీతంగా. .
I am not anti-Telangana heretic. I just want to say that Andhra Bank is not the bank that is limited to present Andhra Pradesh. Andhra Bank even has branches in Orissa, Tamil Nadu and other states. Andhra Bank was originally founded as Mahalaxmi Bank and later it was renamed as Andhra Bank. Even Punjab National Bank has branches in various states. My mother is working in Andhra Bank. Andhra Bank was multi-state scheduled bank even 25 years ago.
@ రమణి
ఆంధ్ర ప్రజలు అందరూ సమైక్యంగా జోలె పట్టుకొని విరాళాలు సేకరించి మా 'అన్ని' ఖర్చులూ ప్రాయోజితం చేస్తే మేము అందరం అలాగే వచ్చి అన్ని పట్టణాలలో మిమ్మలందరినీ అలరిస్తాము. మిగతా వాళ్ళ సంగతేమో కానీ నాకు మాత్రం 'మాంఛి' సెక్యూరిటీ వుండాలండోయ్. తెలంగాణాలో కాలిడితే తన్నులు తప్పవు అని అమ్రికా విదేశాంగ శాఖ నాకు ప్రత్యేకంగా సూచించింది. బ్లాగర్స్ మీట్ ఏదయినా వుంటే బురఖా వేసుకొని వస్తాను.
వీరుభొట్ల,రవిచంద్ర,అజ్ఞాత గార్లు...పోస్ట్ నచ్చినందుకు సంతోషం.
నాగా...ఊరికే ఊత్తుత్తినే...
శరత్తూ...అప్పుడె లేచావా...వా..వా...
గురువు గారు...అలా ఎలా?
శ్రావ్య,మువ్వ గార్లు...సంతోషం నచ్చినందుకు.
రమణి గారు...శరత్తు ఏదో అంటున్నాడు చూడండి...
ప్రవీణ్ గారు...అంధ్రా బేంక్ అంటే ఆంధ్రా కి మాత్రమే చెందిన బేంక్ అనుకోలేదండీ,అది మొదట భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్థాపించిన బేంక్ అని తెలుసండి(అందుకే కింద లింకిచ్చాను వార్త చూడమని).చరిత్ర చెప్పినందుకు ధన్యవాదాలు.
శరత్తూ...అందుకే కొన్నాళ్ళాగు మరి.కబురెడతాం ఎప్పుడూ రావాలో(హిహిహి).
శ్రీనివాస్ గారూ. మీది కోస్తా ఆంధ్రా? తెలంగాణా? ఈ కథలో మీరు వాడిన బాషకీ, తెలంగాణా బాషకీ కొంచెం తేడా ఉంది. కరీంనగర్, వరంగల్ జిల్లాలలో సంవత్సరాల పాటు ఉన్నాం. ఆ అనుభవంతో చెప్పగలను.
LOLOLOLOLOLOL ...
have been laughing for the last 15 minutes ... and I am reading it - the second time :))
మస్తు జెప్పినవ్ గదా... భలే నవ్వుకున్నాను.
:-)
టైం బాబు... టైం.
రౌడీ,బారారె...పోస్ట్ నచ్చినందుకు సంతోషం
ఏకలింగం...టైమా...17 డిసెంబర్ 2009 10:55 am అయింది తమ్ముడూ(హిహిహి)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి