శనివారం 19 డిసెంబర్ 2009

కసబ్ గానికి పెళ్ళని డిసైడ్ చేసిన...


ఈ కసబ్ గాడెవడో గుర్తున్నాడా?ఎందుకు గుర్తుండడు లెండి.మనందరికీ బాగా దగ్గర చుట్టం కదా మరి. అసంటోనికి మరి పెళ్ళీడొచ్చింది కదా మరి పెళ్ళి కావాలి గందా అందుకని.

సరే అసలు విషయమేంటంటే ఈ కసబ్ గాడు(అప్పటికి మైనర్ అంట గందా? ఆడి లాయర్ సెప్పిండు గందా అప్పట్లో)మనకి దొరికి ఏడాది పైనే అయింది గందా,ఆని మీద కేసులయీపెట్టి లొల్లి చేస్తుండరు గందా, మరిప్పుడు పెద్దోడు అయిండంట గందా అందుకని ఆని అమ్మ ఆణ్ణి నేను చూడకపోతే చచ్చి పోతాను అందుకని చివరి కోరికగా ఈని పెల్లి చూడాలని కోరిందనుకోండి సప్పోజ్ ఫర్ సప్పోజ్ ఆడెన కాలమాటుండె లాయరూ కూడా అప్పీలు చేస్తారన్నమాట మన పెబుత్వానికి. అప్పుడు మన పెబుత్వం అడ్డుపుల్లెలాగూ వేయదు కానీ జనాలేమన్నా అనేసుకుంటారేమో ఒకవేళ రాజకీయంగా కుదరదు అని చెప్పి లోపాయికారిగా హ్యూమన్ రైట్సాళ్ళు మాత్రం లగెత్తుకొచ్చేట్టు చేసి ఆళ్ళచేత గొడవెట్టించి కిరికిరి చేసి సరే అన్నాదనుకోండి.అప్పుడేంటి సంగతి? ఆడందరూ చూస్తుండగా పిట్టల్ని కాల్చేసినట్టు జనాల్ని కాల్చేసినా ఏళ్ళకొద్దీ కేసులంటూ సాగదీసి జనాలకి ఆడెవడో కూడా మర్చి పోయే దాకా చేసి అప్పుడు ఈనాడు మధ్య పేజీలో వార్త రాసినట్టు సడీసప్పుడూ లేకుండా ఏదో తీర్మానిస్తారు. ఆ వార్త జాతీయ వార్తల్లో ప్రాంతీయ వార్తలు చెప్పినట్టు టీవీలో చెప్తారు.

అసలు గొడవేంటంటే ఆడొక అమాయకుడంట,ఊరూరికే ఉత్తుత్తినే బొంబాయి సూడ్డానికి వచ్చాడంట, ఆ పక్కనెక్కడో పడున్న వస్తువుని(తుపాకీ అంట)సూత్తంటే ఈ పోలీసులు ఆడ్నట్టేసుకుని జైల్లో ఎట్టే సారంటా అడి మీద కేసులెట్టేసి.ఆడికసలు ఆ ఏకే-47ఆ అదేంటో తెలీదంట,దాని తుపాకి అంటారని ఎవరో అంటుంటే విన్నాట్ట మరసంటోడ్ని పట్టుకుని లోపలెయ్యడం తప్పే గందా.మీరే సెప్పండి ఆడొకటే గోల.

అందుకని ఆడికో మాంచి గుంటని సూసి ముడెట్టేత్తే ఇక్కడే పడుంటాడు జైల్లో కాపరం చేసుకుంట ఎలాగూ ఆడిమీద కొన్ని కోట్లు కర్సెడతన్నారు గందా,ఆడితోపాటు ఆ గుంటకీ కూడా కర్సెడితే పోలా, లేకపోతే పెజానీకం ఏదన్నా అనుకోదూ.ఎలాగూ ఈ కేసు తేలేసరికి(అప్పుడేనా?)ఆళ్ళిద్దరికీ ఓ బుడ్డడో బుడ్డదో పుట్టేస్తే మన దేశ పౌరసత్వం కూడా ఇచ్చెయ్యచు నా బొంద ఇచ్చేదేంటి ఆటోమేటిగ్గా వచ్చేత్త దేమో గందా, అలా ఆడు కూడ మెల్లిగా పెబుత్వ ఖర్చులతో నామకరణ మహోత్సవం చేయించెయ్య చ్చు మన తిరుపతి దేవుడి సొమ్ముతో చేసిన సామూహిక వివాహాల్లాగ.అలా మెల్లి మెల్లిగా ఆ కూన పెబుత్వ ఖర్చులతోనే పెద్దయిపోయి ఎన్నికల్లో నిలబడిపోయి గెల్చేసి ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోయి మెల్లిగా ఉంటే ఆళ్ళ నాన్నమీద కేసో లేకపోతే పొరపాట్న వేసిన శిక్షో రద్దు చెయ్యించె య్యచ్చు. లేకపోతే ఈ లోపున సోనియమ్మదో అప్పటికి రాహుల్ దో పుట్టినరోజొస్తాది గందా అప్పుడు బేఫికర్గా ఆడ్ని వదిలెయ్యచ్చు క్షమాబిక్షెట్టి. ఆ పాట్ని అందరూ కల్సి హేపీగా డ్యుయట్లు పాడుకుంటూ కాలం గడిపెయ్యచ్చు అప్పుడప్పుడు ఆగస్ట్ 15కి జెండా ఎగరేస్తూ. జై భారత్ మాతా కీ జై.

7 వ్యాఖ్యలు:

లలిత చెప్పారు...

ముందా ఫొటో మార్చెయ్యండీ మీకు పుణ్యముంటుంది . ఆ పిల్లోడు సినిమాల్లో నటించడానికొచ్చా డంటండీ పాపం . భలే నటిస్తున్నాడుకదా !

అజ్ఞాత చెప్పారు...

కసబ్ గానికి తెలబాన్ జిన్నా కెసిఆర్ కు పెళ్ళి చేస్తే సరిపోతుంది.

AMMA ODI చెప్పారు...

కుదిరితే నళిని లాగా ఎం.సి.ఎ.లు కూడా చేయచ్చు. నళిని లాగా పిల్లల్ని కనచ్చు. ఎంతయినా మనది గొప్ప ప్రజాస్వామ్య దేశం కదా! మంచి టపా అందించారు. నెనర్లు!

సుజాత చెప్పారు...

అమాయకుడేదో సినిమాల్లో వేషాలేసుకుందామనొస్తే ఇంత పని చేస్తారా మీరు? ఏదైనా సినిమాలో వేషమిప్పించడి! అదీ అమాయకుడి పాత్ర అయితేనే!ఇప్పటికే అవార్డు స్థాయిలో నటిస్తున్నాడు.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

లలితగారు..ఈ ఫొటో కే ఇంత భయపడితే మరి వాడు చేసిన అకృత్యానికో?అవును నిజమే వాడు మంచి నటుడు,వాడికీ సలహా ఇచ్చిన వాడూ గొప్ప దర్శకుడు కూడా.
అజ్ఞాత గారు.. :)
ఆదిలక్ష్మి గారు...అవును మనది ప్రజాస్వామ్య దేశమే,కాదా మరి?
సుజాత గారు..అవును తప్పక ఇప్పించాల్సిందే వేషం,అయినా మనకెందుకు శ్రమ ఈపాటికే ఏ బాలీవుడ్ నిర్మాతో ఉండనే ఉంటాడు రెడీ గా వీడి కాల్‌షీట్ల కోసం.మనం ఎదురుచూడ్డమే వీడి సినిమా కోసం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని.

రమణి చెప్పారు...

హ్మ్మ్.. వాడి కోట్లు ఖర్చుపెట్టి పోషిస్తున్నారు కాబట్టి వాడి విలాసవంతమైన జీవితానికి పెళ్ళి ... బాగుంది. ఈ తంతు చూసేవాళ్ళకి ఎంత స్ఫూర్తి దాయకమో ఎదన్నా గొడవల్లో పాల్గొంటే రాచమర్యాదలేనన్నమాట.

ఈమధ్యేదో పాట విన్నా "ఎందుకే రవణమ్మా పెళ్ళేందుకే రవణమ్మా అని..తాను దూర సందు లేదు మెడకేమో డోలా " అని వస్తుంది ఈ పాటలో.. తాను దూర సందు గొడవల్లో వేలు పెట్టడమేనేమో..

monkey2man చెప్పారు...

నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html