ఆదివారం 24 జనవరి 2010

పరువు తీసేసిన ఎంటీవోడు...


తణుకు కాలేజీలో మనం సెలరేగిపోతున్నరోజులయి...
సాయంత్రేళ కుతంత కళాపోసనకని నరేంద్రా చిత్రమందిర్ దాక బయ్లదేరా సావాసగాళ్ళతో.తణుకు ఊరుమొత్తానికి పైసా కర్సు లేకుండా సూపర్ కళాపోసనుండే లొకేసన్ అది.శానా రోజుల్నించి ఎంటీవోడి కొత్త బొమ్మ రాక సికాగ్గా ఉంది,అదెప్పుడొత్తదో మనమెప్పుడు సూత్తమో అనుకుంటా బీటేసుకుంటన్నా కలరింగుకి.అలా సూత్తంటేనే పోస్టర్లంటించే కుర్రనాకొడుకు సైకిల్ మీద ఎళ్తన్నాడారోడ్డటుపక్క కొత్తపోస్టర్ల ట్టుకుని.మనకి సెవులు రిక్కించాయి ఆరోగేనంలో(సిస్తుసెన్సులో)ఏదో శుభవార్తన్నట్టు.ఇంతలో ఆడు సైకిలు గోడపక్కనాపి యెనకాల కట్టలోంచి కొన్ని పోస్టర్లు పీకి సైకిలు ముందు అడ్డరాడ్డుకి యేల్లాడగట్టిన జిగురు బాల్సీ లోంచి కుతంత జిగురు తీసి ఆ పోస్టర్లు అట్టుకుని గోడకేసి నడిసాడు.మనకి లోపల ఓ సెన్సన్ పెరుగుతాంది ఏంటా బొమ్మాని.ఆడు తాపీగా ఆ పోస్టర్ని గోడకి దాపెట్టి యెనకమాల ఆ జిగురు ముద్ద ముందడ్డంగా ఆతర్వాతైమూలగా మొత్తం పూసేసి దాని తిరగేసి గోడకేసి అంటించడం మొదలెట్టాడు. మొత్తం అంటిన్సాక దాన్ని ఓమూలట్టుకుని ఒక్క లాగులాగాడు,అది మధ్యలోకల్లా సిరిగి సచ్చింది మల్లా దాన్ని అలాగే యెనక్కి గోడకి అదిమేసి దాని మీద మరికుతంత జిగురు రాసిపాడేసాడంతే(ఏంట్రా అంటే ఆ పోస్టర్ సించేసి ఇంటికి పట్టుకుపోకుండానంట అప్పట్లో అదో కిటుకు దానికికూడా)

సరే అసలిసయానికొస్తే ఆ పోస్టరు సూత్తానే నోరట్టాగే తెరిసిపెట్టా,ఎందుకంటే అది ఎంటీవోడి కొత్త బొమ్మ సూపరున్నాడు నాకొడుకు ఆ బొమ్మలో.గభాల్న రోడ్డుకటుపక్కురికా ఎక్కడా రిలీజు యవ్వారమేంటో సూద్దామని.వచ్చేపొయ్యే జనాల్ని తోసుకుంటా ఆ గోడదాక లగెత్తా,ఎందుకో అర్దం కాక నాయెనక మాతొట్టిగేంగ్.తీరాసేసి ఆగోడదగ్గరకెల్లి ఆ పోస్టర్ సూడగానే సగం బొమ్మ సూసినంత మనసయింది. ఎంటీవోడూ భలే యంగు గున్నాడ్లే, పక్కన జయప్పెద కుతంత వొల్లుసేసి కత్తిలాగుంది గుంటది.అలా పైకి సూసుకుంటా ఎల్లగానే అక్కడ టాకీసు పేరు కనపడగానే మతోయింది నాకు దీనమ్మాని మనూళ్ళో ఇయ్యనేలేదు కొడుకు "గుడేన్నిచ్చేడు" రేలంగిసిత్రమందిర్ లో అదీ రేపే.శానా కోపమొచ్చింది కొడుకుమీద, ఆ పోస్టరంచినోడక్కడుంటే ఆడ్ని సితగ్గొట్టేవోడ్నే ఆరోజు.శానా సేపు ఆ పోస్టర్నే సూసేసి ఎట్టాగెట్టాగా పొయ్యేదీ సూసేదీ ఆలోసిత్తనే మెల్లగా ఆస్టల్కి సేరాం అంతా.

ఆస్టల్కొచ్చి కాసేపాలోసించాక మాంచి ఆలోసెనొచ్చింది.ఎట్టాగయినా రేపు క్లాసెగ్గొట్టి గుడెం యెల్లి ఆ బొమ్మ సూసి రావాలి మరి. రూమ్మేటు రంగా గాడిది గుడెమే అందుకే ఆడ్ని రెచ్చగొట్టా,కాని ఆడు కొంచం బయపడ్డాడు ఎందుకంటే అదే ఆ టాకీసున్న రూట్లోనే ఈల్ల కొట్టుందంట,దొరికిపోతే ఈపుసాపవుద్ది మరి ఆడి బాబుతో.మరి మనకా బాదలేదు కదా అందుకని ఆడ్నొదల్లా గోకిగోకొదిలిపెట్టా ఊ అనేంతవరకూ సొమ్ములతో సహా, కాలేజి స్టోర్లో దొంగబిల్లు రాయించి సొమ్మిచ్చేత్తానంటే కానొప్పుకోలేదాడుకూడా (సరుకులు కొనేసి ఆడికే తిరిగిచ్చేత్తామన్నమాట,ఆడు సొమ్మిచ్చేత్తాడు అంతే అదో సొమ్మెడ్జస్టుమెంటూ... శానామంది క్రెడిట్ కార్డులు ఇయాల్టిరోజున అలాగే వాడ్డం సూసా నేను)

రాత్రంతా జయప్పెదాని ఈస్టుమన్ కలర్లో ఊహించుకుంటా గడిపేసా.మొత్తానికి కాలేజెగ్గొట్టి బస్‌స్టాండుకెల్లి గుడేం బస్సెక్కి హాలుకి సేరేవరకూ తెగ సెన్సనయిపొయ్యింది నాకు ఎప్పుడెప్పుడా బొమ్మ సూత్తామా అని..
మా రంగా గాడి గోల ఆడిది ఆడిబాబెక్కడ సూత్తాడా అని మనగోల మనది.సరే మొత్తానికి బస్సు మెయిన్ రోడ్రు కాడాపగానే అధాటున దూకేసా కండక్టర్ గాడెర్రిఎదవలా సూసాడు నాకేసి..ఓ అల్లంతదూరాన్నించే కనిపిత్తాన్నారు జనాలు శానా కుసీ అయింది మనసుకి. పరిగెత్తుకుంటా హాలుకాడికి సేరాం. ఎంతమందుంటే మనకేంటి మనకెప్పుడూ టిక్కట్టు దొరకదనే బెంగే లేదు ఆమాటకొత్తే ఎంటీవోడి అభిమానన్నోడెవడికీ ఉండదు నా ఎరికలో,పైగా అది మనూరు కాదసలే ఇంక కుమ్మెయ్యచ్చు ఈరలెవెల్లో..

ఇంకా గేట్లు తియ్యలే హాలసలే బజార్ రోడ్లో ఉందేమో తెగ హడావిడిగుంది అన్నిపక్కలా.ఇంతలో మన లెక్క మనం సేసుకుంటన్నాము ఎట్టా దూసుకుంటా టిక్కట్లు సంపాయించాలా అని.ఇలాటి సోట్లే బాగా పనికొత్తాయి పదోకల్లాసుదాకా స్కూల్లో ఆడుకున్న కొక్కోలూ,కబడ్డీలూ గట్రానూ. పైన ఎండ వాయిత్తాంది బాగా,హాలోడు గేట్లు తియ్యడు ఎప్పటికీ,సేతిలో మడిసి అట్టుకున్న నోట్లూ,సిల్లరా తడిసిపోతన్నయి.అలా మెల్లిగా రంగా గాడ్ని సెయ్యట్టుకుని పద్మవ్యూహం లెక్క ఒక్కొక్కడ్నీ నెట్టుకుంటా సందుసేసుకుంటా గేటుదాకా సేరా.సాలు మనకి టిక్కట్లు దొరికేసినట్టే దెబ్బకి ఆడు గేట్లు తీయ్యడమే తర్వాయి,అదాట్న సూత్తే రంగా గాడు సెయ్యి జారిపోయింది తడికి,పోన్లే సొమ్ములున్నాయి గందా,ఒక్కోడికి రెండు టిక్కట్లిత్తాడు గ్యారంటీగా. అప్పుడెతుక్కోచ్చులే ఆడ్ని తీరిగ్గా అనూరుకున్నా.ఇంతలో గేట్లు తియ్యడం ఒక్కసారి జనాలంతా నన్ను తోసుకుంటా ఈడ్చుకుంటా కౌంటర్ దాకా లాకెల్లడం జరిగిపొయ్యాయి. ఒక్కసారి ఆ క్యూలోకెల్లిపోతే సాలు టిక్కట్టు దొరికిపోద్ది బ్లాకులో ఇయ్యాపోతే(ఈ మాత్రం తెలివితేటలు, లెక్కా,మనసూ సదువులో ఎట్టుంటే ఫస్టుకల్లాసులో పాసయ్యిండేవోడివి కొడకా).ఏ క్లాసు కౌంటర్లోకెల్లానో ఎంత సొమ్మో లెక్క తెలీదు కానీ ఏదయినా మనసేతిలో ఉన్నసొమ్ముకి సరిపోద్ది కాబట్టి పర్లేదనుకుంటా ఆ క్యూలో కల్సిపోయా.కాసేపట్లో కౌంటర్లో సెయ్యెట్టా రెండియ్యంటూ,ఆడికి నేకనపడా నాకాడు అగపడ్డూ అదీ మన లెవెలు.ఆడియ్యనంటాడు నీ లెవెలకి, కాసేపు గొడవెట్టాక ఎనకాలోడు తట్టుకోలేక నన్నెత్తుకుని ఆ కౌంటర్లో ఆడికి సూపెట్టాక ఇచ్చాడు టిక్కట్లు రెండు,అంతె నాయెనకాలిద్దరికిచ్చాక కౌంటర్ బందన్నాడంతే. అంతే గోలె గోల ఆహా ఆహాహాకారాలు సెవనానందకరంగా ఉన్నయి కదా(ఉండవూ మరి మనకి టిక్కట్టు దొరికి ఎనకాలోల్లకి దొరక్కపొతే)..

అప్పుడు గుర్తొచ్చాడు రంగాగాడు బొమ్మ మొదలయిద్ది గమ్మునెతకాలీడ్ని అని సూత్తంటే ఆడెర్రిమొహమే సుకుని ఆ మూసేసిన గేటెనకాలే ఉన్నాడు నాకోసం సూత్తా. ఆహా లగెత్తుకెల్లి గేటుకాడా కీపర్ని ఆడికీ టిక్కట్టుందని సూపించి లాక్కొచి లోపల్కి దూరాము,అప్పుడే తెరతీత్తన్నాడు అమ్మయ్యా అదీ లెక్కంటే పేర్లేసేదగ్గర్నించీ సూడాపోతే బొమ్మకిలువేలేదనిపిత్తాది నాకయితే.మా గురువంటాడు ఆ సిరిగిపోయిన సిల్కుగుడ్డలెనకాల తెరమీద ఎగిరే పురుగుల్నీ ఆటికోసం తిరిగే బల్లుల్ని కూడా సూడాలంటాడు అప్పుడే మజా అంట ఆడికి(నిజమేనేమో పుర్రెకో బుద్ది).

ఇంతలో తెరెత్తగానే పేర్లేసేసాడు డైరెట్టుగా టాంటడాం అంటూ నటరత్నం ఎంటీ వోడూ,అందకత్తె జయప్పెదా నటించిన "యుగపురుషుడు" బొమ్మ.అంతే హాలంతా అద్దిర్పోయింది ఇజిల్సుతో పదినిముసాలు,ఇంకా తర్వాత పేర్లే కనపడ్లా పువ్వుల రేకలు తప్ప,ఎంటివోడొచ్చినప్పుడూ అంతే అసలే "కరాటే" ఈరుడీ బొమ్మలో అదే పెసలెట్రాక్సన్.ఇంక జయప్పెదయితే దీన్సిగతరగానీ సెప్పాల్సిందేంటిగాని సూడాల్సిందే, సూసి తరించాల్సిందే. బొమ్మంతా కుమ్ముడే కుమ్ముడు తెరమీదెంటీవోడూ సీట్లో పక్కోడ్ని మోచేత్తో నేనూ.

బొమ్మొదలగానే మల్లా బస్సెక్కి ఆన్సైటుకమెరికాఎల్లొచ్చినాడి లెవల్ల్ల్లో ఊల్లో దిగతండగానే ఎడమకన్న దిరింది నాకు.సిన్నప్పుడు నాయనమ్మ సెప్పింది గుత్తొచ్చింది "ఒరే అబ్బిగా మొగెదవకయితే కుడికన్నూ ఆడపిల్లకి ఎడమకన్నూ అదిరితే మంచిదని".అక్కడితో ఆగచ్చు గందా మనం పెద్ద లెవెల్గా ఆపోజిట్టయితే ఏమవుద్దని అడిగా ఎంగిలిపీసులో, సెడుజరుగుద్దని సెవిమెలెట్టి మరీ సెప్పింది సచ్చెక్కడుండో ముసిల్ది.

అది గుర్తొచ్చింది ఎందుకో,అయినా పెద్ద పట్టించుకోలే అసలే కాలేజిలో కదా ఉద్దరించేది సదువు,ఆస్టల్కి ఎల్లేదానికి కాలేజ్ దాటి పెద్ద గ్రౌండ్లోంచెల్లాలి,ఆ దారంతా సెట్లు అయీ బాగా పెంచారు కాలేజోల్లు.సరే ముందెల్లి స్టోర్సులో రాముల్తో సొమ్ముల బేరం మాటాడొప్పించి ఆ దారంట కుతంత దూరం ఎల్లగానే ఆ మొగ తిరిగే దగ్గర ఎవరో తెల్సున్న మొగం కాపడగానే గుండాగిపొయ్యిందంతే.బొమ్మ సూసిన సోకంతా జారిపొయ్యింది అరికాల్లోకి అధాటునొక్కపాలి. మెల్లిగా అడుగేత్తా అక్కడికి సేరి ఆటోమేటిగ్గా ఆగాయి కాళ్ళు,అవతల్నించి ఒకటే పెస్నొచ్చింది ఎక్కడికెల్లావని.మరసలే నిజం సెప్పాలి కదా బుద్దిగా "గుడెం ఎల్లా సిన్మా సూడ్డానికని"సెప్పటం పూర్తయ్యేలోపే గూబ ఫేడేల్మని పేలిపోయింది దీపావళి పటాసులా.
ఆ దెబ్బకి నా గూబా,కింద నేలా,మా క్రికెట్టాడుకునే గ్రౌండూ,కాలేజీ,ఆ సెట్లూ,అక్కడున్న జనాలూ, పైనింటికెల్తున్న సూరీడూ,ఓలుమొత్తం పెపంచమంతా ఎర్రగా కనపడ్డాదంతే. ఇంక మాటల్లేవ్ అంతా సేతలే దెబ్బకి ఆస్టల్ ఖాలీ సేయించి పక్కనే భీంవరాన్నున్న మా సిన్నాన్నింటికాడెట్టాడు పెద్దాయన నన్నట్టుకెల్లి. రోజూ పొద్దున్నే నాల్గింటికల్లా లేసి తెమిలి సద్ది మూటట్టుకుని, లగెత్తుకుని ఆర్.సీ(రైల్వే కార్) అట్టుకుని కాలేజీకి రావాల్సొచ్చింది దెబ్బకి.

అలా ఎంటీవోడు నా జీవితంతో ఆడుకుని, నా పరువు మొత్తం గోదాట్లో కలిపేసాడు ఆడి జిమ్మడానీ... (గుడ్డిలో మెల్లేంటంటే అక్కడ ఆడంగులు సదవట్లేదు కాబట్టి కానీ లేపోతే మనపరిత్తితేంటో)...

30 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

ఆయ్.. ఏం సెప్మంటారండీ.. ఏసంకాలం మద్దినేల గోదాట్టో ఈత కొట్నట్టుందండి.. ఆ ఎంటీవోడేనా అండీ.. ఆనాకొడుకు జీవితాలతో ఆడుకుంటాడండి, ఆయ్.. ఏమాట కామాటే సోప్పుకోవాలి కానీండీ, జెయప్రేదా ఇసయంలో మీరట్టా కామ్పిటీసంకి రాకూడదండి.. మరిక్కడ మనం ఉన్నాం కదండీ.. అదండీ సగతి..

Sravya Vattikuti చెప్పారు...

భలే రాసారు !గుడ్డిలో మెల్లేంటంటే అక్కడ ఆడంగులు సదవట్లేదు కాబట్టి కానీ లేపోతే మనపరిత్తితేంటో) >>మరి ఇప్పుడు ఇక్కడ చదివే ఆడగులందరికి విషయం తెలిసిపోయింది :)

AMMA ODI చెప్పారు...

:))

సుజ్జి చెప్పారు...

హి హి హి..

Vasu చెప్పారు...

ఇందాకట్నించీ సూత్తున్నాను. మా బాసన్నా మా యాసన్నా మీకు ఎకసెక్యాలుగా ఉంది మీకు. సూత్తూ ఊరుకునేది లేదింక. :)

Vasu చెప్పారు...

ఆ ఫోటో ఏంటి కుమ్మేసాడా ఎన్టీవోడు..

sunita చెప్పారు...

హహహ! బాగుంది!ప్చ్ ..అలా ఐపోయిందన్నమాట.

మంచు పల్లకీ చెప్పారు...

తణుకులొ పాలిటెక్నిక్ చదివారా??

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

ఆయ్ బోల్డు థేంక్సులండి మురళిగారు,ఆ ఎంటీవోడంతేనండి.మరి జెయప్పెదా ఇసయంలో సద్దుకుపోవాలండి మరి.అడివిరాముడు జయప్పెదా మీకండి,యుగపురుషుడు జెయప్పెదా నాదండి,మరలా సద్దుకుపోదామండి ఈపాలికి.

శ్రావ్య...ఇప్పుడు ఇక్కడాడంగులకి తెల్సినా పర్లేదండి,ఎందుకంటే అప్పుడు అగమానమండి,మరిప్పుడేమో అదొక తీపో/చేదో అనుభవం కాదంటండి.(ఇప్పుడు గతం అప్పటికి వర్తమానం)

ఆదిలక్ష్మి గారు...మీ బోల్డు నవ్వులకి నా బోల్డు థేంక్సండి

సుజ్జి...మాకూ వచ్చమ్మా(హిహిహి) మేమసలే కచికతో పళ్ళుతోముకుంటాం కూడా.

వాసు...ఆయ్ బాబోయ్ బయమేత్తన్నాదండి.ఈపాలికి సెమించొగ్గెయ్యండి బాబయ్యా.

వాసు...ఆయ్ అవునండే ఆడే కుమ్మేసెడండే బాబూ.

సునీత...మరే అలా అయిపొయిందన్నమాటండి.

మంచు పల్లకీ చెప్పారు...ఆయ్ అవునండి తమరికేవురన్నా తెలుసేటండి ఆ లొకాల్టీలో.తెలిత్తే ఒకుత్తరమ్ముక్క కొట్టండీ ఎడ్రస్కి.
pappusreenu@gmail.com

గీతాచార్య చెప్పారు...

మొత్తానికీ నా చేత వ్యాఖ్య వ్రాయించారండీ మీ టపా అలా బలవంత పెట్టింది :-D

మంచు పల్లకీ చెప్పారు...

భలెవొరె.. మా వూరొచ్చి .. మా పేట కొచ్చి.. మా వీదిలొకొచ్చి ..మా కాలెజిలొకొచ్చి .. ఎవరయినా తెలుసంటారా .. హన్నా ;-))

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

ఆచార్యా...ఏదో బలవంతంగా రాసినట్టుంది సారూ...
మంచుపల్లకీ...అయితే మీరు లోకలూ,మేం వోకలూ అన్నమాట :)

balasubrahmanyam.b చెప్పారు...

Simply superb

balasubrahmanyam.b చెప్పారు...

Simply iragadeesaru

balasubrahmanyam.b చెప్పారు...

simply superb

చైతన్య చెప్పారు...

:-)

రమణి చెప్పారు...

"ఇలాటి సోట్లే బాగా పనికొత్తాయి పదోకల్లాసుదాకా స్కూల్లో ఆడుకున్న కొక్కోలూ,కబడ్డీలూ గట్రానూ...." అక్షరసత్యం చెప్పారు.

"ఏదయినా మనసేతిలో ఉన్నసొమ్ముకి సరిపోద్ది కాబట్టి పర్లేదనుకుంటా ఆ క్యూలో కల్సిపోయా.కాసేపట్లో కౌంటర్లో సెయ్యెట్టా రెండియ్యంటూ,ఆడికి నేకనపడా నాకాడు అగపడ్డూ అదీ మన లెవెలు.ఆడియ్యనంటాడు నీ లెవెలకి, కాసేపు గొడవెట్టాక ఎనకాలోడు తట్టుకోలేక నన్నెత్తుకుని ఆ కౌంటర్లో ఆడికి సూపెట్టాక ఇచ్చాడు టిక్కట్లు రెండు.."

హహ్హహ.. మంచి హాస్యం.. మనగురించి మనం హాస్యంగా మాట్లాడడం గొప్ప కళ..ఆద్యంతం మంచి హాస్యంతో బాగా రాసారు.

బ్లాగాగ్ని చెప్పారు...

కుమ్మేహారంతే.
>>ఈ మాత్రం తెలివితేటలు, లెక్కా,మనసూ సదువులో ఎట్టుంటే ...
>>ఆహా ఆహాహాకారాలు సెవనానందకరంగా ఉన్నయి కదా
వంటివి బాగా నవ్వించాయి.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

@బాలగారూ...మీరు మరీ శోభన్ బాబు లా ఉన్నారే(మూడేసి సార్లు మెచ్చుకుంటూ)
@చైతన్యా...సేం టు సేం.
@రమణి గారు...పోస్ట్ నచ్చినందుకు థాంక్స్.
@బ్లాగాగ్ని...థేంక్సండే.

మధురవాణి చెప్పారు...

అయ్ బాబోయ్ ఎంత పని జరిగిపోనాదండీ.. ఎంటీవోడు అంతపని సేసేసినాడా :)
ఎంతయినా మీరు మహా గడుసు సుమీ.. మీ ఈ అగమానానికి జయప్పెదాని రవ్వంత మాట కూడా అనకుండా వోలుమొత్తం తప్పంతా ఎంటీవోడి మీదికి నేట్టేసినారు ;-)
చాలా బాగా రాసారండీ..!

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

@ మధురవాణి...మీరు భలే కనిపెట్టేసారండి బాబు నా గడుసుతనాన్ని ఆయ్.థేంక్సండీ.

sowmya చెప్పారు...

ఆవునండీ, ఎంటీవోడు సానమందిని బయపెట్టాడు... మా ఊల్లో పేగులు తీసి ఒకావిడని బయపెట్టాడు ఇట్టానే, మీరూ సూసారు కదండీ నా పోస్టు

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

@ సౌమ్య..ఎవరి పేగులూ?(ఆయ్ అద్దరకొట్టారండి పోస్ట్)

లలిత చెప్పారు...

అయ్యబాబోయ్................ నవ్వలేక సచ్చిపోనానండి . నా పేనానికేటన్నా అయితే , ఓలుమొత్తం మీదేపూచీ అండి ఆయ్.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

@లలిత...శాలా థేంక్సండి బాబూ,ఎంతమాటనేసారండీ సడన్‌గా(అయినా ఇన్స్యూరెన్సు చేయించే ఉంటారేమో కదా...లలిత"శ్రీ"గారు).

లలిత చెప్పారు...

ఈ దేశంలో ఆడోల్లకి కూడా ఇన్సూరెన్సులు సేయిత్తారేటండి ! మీరు మరీ ఇసిత్రాలు మాట్టడేత్తారండీ బాబు . ఎనక ఈ "శ్రీ "ఏటండీ తోకలాగా

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

భలేవోరండీ బాబు మీరు,ఆడోల్లకి ఇన్స్యురెన్సు చేయించేదే దాన్నించి లాభం పొందడానికి(హిహిహి).ఇకపోతే "శ్రీ"అంటే పెళ్ళయితే భర్త గారు "శ్రీ"(లలిత"శ్రీ") అవుతారు కదండి అందుకని అలా చెప్పాల్సొచ్చిందండి,ఆయ్.

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

మరయితే యమగోల జెయప్రెద నాకయ్యో.
యుగపురుషుడు తేజలో ఇప్పటికి ఏడెనిమిదిసార్లు చూసుంటా. హ్హహహహహ
మీగురుగారు కరెస్టేనండొ. వోటిని చూడకపోతే భలేవిసుగు. సినిమాచూసినట్టే ఉండదు.

bonagiri చెప్పారు...

యేటండీ మన తణుకులో రిలీజ్ అవలేదా? ఎంత అవమానం?
అయినా నేను ఈ సినిమా వచ్చేటప్పటికి నరసాపురం వెళ్ళిపోయాను.
అన్నట్టు మా అన్నయ్య తణుకు పాలిటెక్నిక్ లో చదివాడు.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

@చైతన్యా...ఎక్కడా దర్శనాల్లేవు ఈ మధ్యన.
యమగోలయ్యాక ఇంకా ఎక్కడ మిగిలుందండి జెయప్పెద్ద ఒత్తి చెరుకుపిప్పి తప్పా ఇంకోటేదన్నా సెలెక్ట్ చేసుకోండి.(హిహిహి)
గురువెప్పుడూ కరక్టేనండి.

@బోనగిరి గారూ...మరేనండి అందుకే కదా నాకూ బోల్డంత అగమానం అయిపోనాది.
మరయితే మీ అన్నగారి ఇవరాలోపాలి మెయిల్ కొట్టండి ఇక్కడికి.
pappusreenu@gmail.com