
మా మిశ్రా గారి చాతుర్యం (పార్ట్-1):.
మా వాళ్ళు జనలెక్కడా దొరకట్లేదు ఎవడో ఒకగొట్టం గాడ్ని ఆ జాగాలో కూర్చోపెట్టి పనికానిచ్చేద్దాంలే అని ఒక్కోసారి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇదిగో అలాంటప్పుడే ఇలాంటి కేండిడేట్లు దొరుకుతారు ఏరికోరిమరీ, ఈ రిటైరయిపోయిన వాళ్ళని ఏరేరి మరీ తెస్తుంటారు (రిటైర్ అయినవాళ్ళని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు). వాళ్ళకి పెన్షనూ మనకి టెన్షనూ.
అలా వచ్చిన వారిలో ఒకాయనే ఈ మిశ్రా ఇప్పటి కధానాయకుడు.వయసు 65+ ప్రపంచ దేశాల్లో తైలమర్దనం ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దేశాలన్నీ తిరిగొచ్చానంటూ ఉంటాడు.
సరే ఆయనొచ్చిన మొదటి వారంలోనే మేము మాల్ కి వెళ్దామని బయల్దేరాం,ఏవో సామాన్లు కొనుక్కోవాలి నేనూ వస్తాన్నాడు. మాల్ లో సామాన్లు తీసుకుని బిల్ పే చేసాక చూస్తే మిశ్రా గారు మిస్సింగ్. ఒకళ్ళ మొహాలొకరు చూసుకుంటూ మిశ్రా మొబైల్ ట్రై చేస్తే లోపలే ఉన్నా మీరెక్కడున్నారు అంటూ జవాబొచ్చింది. ఎక్కడున్నావంటే ఏమో తెలీదు ఇక్కడే ఎక్కడో అంటాడు.సరే అని ముగ్గురం మూడు పక్కలా పరిగెత్తి మొబైల్ ప్రయత్నిస్తూ మొత్తానికి మిశ్రాని పట్టుకున్నాం లేడీస్ సెక్షన్ దగ్గర.
పనయ్యాక తిరిగొస్తూ ఆయన్ని ఆయనుండే గెస్ట్ హౌస్ దగ్గర దింపేస్తామంటే అక్కర్లేదు ఆ దగ్గర్లో జంక్షన్లో వదిలెయ్యండి చాలు నేనెళ్ళిపోగలను అన్నాడు.సరే అని ఆ జంక్షన్ దగ్గరకు రాగానే మేము ఎడమపక్కకి వెళ్తాము మీరెటుపక్కా తిరక్కుండా తిన్నగా వెళ్ళి కుడిపక్క రెండో సందులో తిరిగితే రెండో ఇల్లే మీరుండేది అని చెప్తే వౌకే నాకెందుకు తెలీదూ అంటూ చాతీవిరుచుకుని మరీ చెప్పాడు. అంతగా తెలీపోతే జాన్ కి ఫోన్ చేస్తాలే అని కూడా చెప్పాడు (జాన్ మిశ్రా ఇద్దరూ ఒకే గెస్ట్ హౌస్ లో ఉంటారు). ఓహో సూపర్ అనుకుని ఆయన ముందు చూపుకి మెచ్చుకుని మేమంతా మా గెస్ట్ హౌస్ కి వచ్చేసాం.ఎందుకయినా మంచిదని జాన్ కి ఫోన్ చేసి చెప్పాము ఇలా మిశ్రా ని ఆ జంక్షన్ లో దీంపేసాము ఆయన చేరగానే ఓ సారి కాల్ ఇమ్మని. సరే నేను గేట్ బయటే ఉంటాలే ఎందుకయినా మంచిది అన్ని ఇళ్ళూ ఒకేలా ఉంటాయ్ మనిల్లు బెల్ల్ కొట్టబోయి ఇంకో ఇంటి బెల్లు కొడితే ఇంతేసంగతులు చిత్తగించవలెను కదా అని అన్నాడు. మంచిదేలే అని మేము ఊ అన్నాము.
మేమంతా రూంకొచ్చి ఫ్రెష్ అయి కూర్చుని టీవీ ఆన్ చేసేప్పటికి జాన్ నించి ఫోన్ ఇంకా మిశ్రా రాలేదు అని. మిశ్రా మొబైల్ ట్రై చెయ్యలేదా అని అడిగితే ఇంకా వస్తున్నా అంటున్నాడు ఆయాసంతో కానీ ఎక్కడున్నాడో చెప్పలేకపోతున్నాడు, నేనూ మెయిన్ రోడ్ మీదకొచ్చాను వెతకడానికి అంటూ చెప్పుకొచ్చాడు.ఆ జంక్షన్ నించి ఆయన్ని దింపి మేము రూంకొచ్చేలోపు ఆయనింటికెళ్ళిపోవాలి అంత దగ్గర కానీ ఇంకా చేరకపోడం ఏంటి అని మాకు అనుమానమొచ్చింది.ఇంతలో జాన్ అన్నాడు మళ్ళీ కాసేపయ్యాక చేస్తా అప్పుడు చూద్దాం ఏమి చెయ్యాలో ఈ లోపున నేను వెతుకుతాను అని ఫోన్ పెట్టేసాడు.
టీవీలో బేజాఫ్రై సినిమా వస్తోంది,ఇక్కడ మా బుర్ర కూడా ఆల్‌మోస్ట్ అదే కండిషన్ లో ఉంది.ప్రతీ పది నిముషాలకీ మేము జాన్ కి మిశ్రా కీ కూడా ఫోన్ చేస్తున్నాము కానీ జాన్ కి మిశ్రా కనపడలేదు మిశ్రాకి ఇల్లు దొరకలేదు అదీ పరిస్థితి. మొత్తానికి 6.30కి మిస్సయిన మిశ్రా 9.30 గంటలకి దొరికాడు అని ఫోన్ జాన్ నించి. ఎక్కడున్నాడు అంటే ఆ చివర కొండల దాకా వెళ్ళిపోయాట్ట వెతుక్కుంటూ మీరు చెప్పిన రెండో సందులో తిరక్కుండా మూడో నాలుగో సందులోకో తిరిగి అక్కడనించి ఇంకెటో తిరిగి అలా అలా. మొత్తానికి దొరికాడులే అని ఆ రాత్రి ప్రశాంతంగా పడుక్కుని పొద్దున్నే ఆఫీసుకెళ్తూ బస్సులో అడిగాం మిశ్రాజీ అలా ఎలా తప్పిపోయారూ అంతగా డౌటొస్తే ఆ సందు దగ్గరికెళ్ళగానే జాన్ కి ఫోన్ చెయ్యచ్చు కదా అంటే ఆయనంటాడూ నేనెన్ని సార్లు ఫోన్ చేసినా జాన్ ఫోనెత్తట్లేదు అతన్నించి మాత్రం నాకు ఫోన్లొస్తున్నాయి అని రెట్టించాడు. అదేంటది ఏ నంబర్ కి చేసారు అంటే ఇదిగో చూడండి అంటూ చూపించాడు ఆ నంబర్. ఒక్కసారి కళ్ళు తిరిగాయ్ మాకందరికీ ఆ నంబర్ చూడగానే దీనికా మీరు ట్రై చేస్తున్నదీ అంటే అవును అదేకదా అతని నంబర్ అన్నాడు.భలే వారు మిశ్రాజీ అది ఆఫీసులో అతని డెస్క్ మీద ఉన్న ఎక్స్‌టెన్షన్ నంబర్ 147. దానికి ఫోన్ చెయ్యాలంటే మీరు ముందు ఆఫీసు లేండ్‌లైనుకి చేసి అక్కడనించి దానికి ఎక్స్‌టెన్షన్ చెయ్యాలి అంతే కాని డైరెక్ట్ గా 147 కొడితే వెళ్ళదు కదా అంటే ఏమో మొన్న జాన్ ని నీ నంబర్ ఎంత అని అడిగితే ఇదే ఇచ్చాడు అదే సేవ్ చేసుకున్నా అన్నాడు అంతే మా కడుపులు చెక్కలయ్యాయి మిశ్రా గారి దెబ్బకి.పోనీ జాన్ నించి మీకు ఫోన్ వచ్చినప్పుడు దానికే మీరు చెయ్యచ్చు కదా అంటే అందులో జాన్ పేరు రాలేదు కదా అని ఇంకో ఝలక్ ఇచ్చాడు మిశ్రా. అయ్యా అదీ విషయం మళ్ళీ ఇంకో పోస్ట్ లో ఇంకో ఝలక్కుతో...
8 వ్యాఖ్యలు:
ప్రపంచ దేశాల్లో తైలమర్దనం ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దేశాలన్నీ తిరిగొచ్చానంటూ ఉంటాడు. కెవ్వు :D
మీరు చెయ్యచ్చు కదా అంటే అందులో జాన్ పేరు రాలేదు కదా అని ఇంకో ఝలక్ ఇచ్చాడు మిశ్రా.
హిహిహి
మీ మిశ్రా
ముప్పుతిప్పలు పెట్టిన్చారా అయితే
విశ్వా మిత్ర లో మిశ్రా గారి కబుర్లు భలే వున్నాయి
గుక్కతిప్పుకోకుండా చదివిన్చేసారు
eagerly waiting for next part
పెన్షన్ పార్టీతో మీరు పడ్డ టెన్షన్ చాలా బాగుంది. నేను కూడా ఒకరు ఇద్దరు రిటైర్ అయిన బాసుల దగ్గర వర్క్ చేసాను. మీరు చెప్పిన సంగతులే కాక కొంత చాదస్తం కూడా ఉంటుందేమో వారికి.
KEVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVV
enjoy with your mishra!!
కేక కేక ... మీ మిశ్ర కి జై ;)
Misra for President! :)
ఇంతకీ ఏ దేశంలో జరిగిందీ కథ?
బైదవే తైలమర్దనం చేసే దేశాలనగా నేమి?
మీ బ్లాగు హెడర్ కింద ఎడమవేపు ఉదహరించిన పాట చివరి వరుస "నన్నే నడిపే దేవత నీవే" అనుండాలి
హరి..రెండో పార్ట్ త్వరలోనే వచ్చేస్తోందొచ్చేస్తోందొచేస్తోంది.
స్వర్ణ...మరే వయసుతోటొచ్చే చాదస్తం,అదీ కాక ఔటాఫ్ సైట్ ఔటాఫ్ మైండ్ అంటారు కదా అలాగన్నమాట.
మలక్,కార్తీక్,బంతి...స్పందనకు ధన్యవాదాలు.
గురువుగారూ...హ్హహ్హహ్హా మా బాగా చెప్పారు(మిశ్రా ఫర్ ప్రెసిడెంట్)
ఇది జరిగింది ప్రస్తుతం నేను పనిచేస్తున్న(మీ వమెరికాకి తలనొప్పిగా తయారయిన)దేశం యెమెన్ లో.
ఇకపోతే తైలమర్దనం చేసే దేశాలంటే "ఒపెక్"దేశాల్ని అలా ఉదహరించాను(యెమెన్ అందులో మెంబర్ కాదనుకుంటా)
మీరు చెప్పిన మార్పు సరిచేసాను ధన్యవాదాలు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి