కాసేపటికి అలా చెప్తున్న మిశ్రా గారు లేచి బయటకెళ్ళారు.రమేష్ ఇప్పుడు శ్రద్ధగా సినిమా చూడగల్గుతున్నాడు అవతార్ లో అవతారాలన్నీ.సినిమా అర్ధం అవుతోందనిపిస్తోంది ఇప్పుడు ఇందాకటికంటే.ఓ 15నిముషాలయ్యాక మిశ్రా గారొచ్చారు,కొంచం గాభరాగా ఉన్నారు మొహం అదోలా పెట్టుకుని.రమేష్ పెద్దగా గమనించలేదు సినిమా లో కూడ అంతకంటే అదేదోలా ఉండడంతో.మిశ్రా కుర్చీలో కూర్చుందామని ప్రయత్నించారు రమేష్ ఏ ఫీలింగూ లేకుండా అవతార్ సినిమాలో పరకాయప్రవేశం చేసాడు.లేప్‌టాప్ స్క్రీన్ మొత్తం నీలం రంగులోకి మారింది, మిశ్రా గారి మొహం పంచవర్ణాల మిశ్రమం అయింది.కానీ ఎదో ఇబ్బందనిపించి మళ్ళీ లేచి బయటికెళ్ళారు రమేష్ గమనించకపోడంతో ఫీలయ్యారు.
ఇంకో 15నిముషాలయ్యాక సినిమా అయిపోయింది రమేష్ ఈ లోకం లోకొచ్చాడు.ఎదురుగా చూస్తే మిశ్రా గారు లేరు.లేప్‌టాప్ స్క్రీన్ మీద చూసాడు అక్కడా కనిపించలేదు,అప్పుడు గుర్తొచ్చింది సినిమా అయిపోయిందన్న విషయం మళ్ళీ.కంటిన్యూస్ గా చూసాడేమో ఓ సారి కుర్చీలోంచి అటు ఇటూ కదిలి ఇంకెక్కడో ఏదో కదిలినట్లయి బయటికెళ్ళాలనిపించి రూం బయటికొచ్చాడు ఆ పనికానిద్దామని.రూం లోంచి బయటికి రాగానే దానికి ఆనుకుని ఎడమపక్కనే ఉన్న తలుపు తీసుకుని లోపలికెళ్ళి పనికానిచ్చి చెయ్యి కడుక్కుని బయటికొచ్చి తలుపు మూస్తుండగా ఎదురుగా అల్లంత దూరంలో మిశ్రా గారు చాలా గాభరాగా కాలుకాలిన పిల్లిలాగ తిరుగుతూ కనిపించారు.
ఆయనా రమేష్ ని చూసాడు ఇంతలో ఒక్కసారి ప్రాణం లేచొచ్చినట్లయి పరిగెత్తుకొచ్చాడు నాలుగంగల్లో ఆ తలుపు దగ్గరికి. దగ్గరికొస్తూనే రకరకాలుగా మొహం పెట్టి (రమేష్ కి వెంటవెంటనే రెండు సార్లు అవతార్ సినిమా చూసినట్టనిపించింది ఆయన్ని అలా చూడగానే) చిటికెనవేలు చూపించాడు ఇదేనా ఆ రూం అంటూ, రమేష్ అవును అని చెప్పే లోపలే అతన్ని పక్కకి తోసేసి లోపలికి దూసుకుపొయ్యాడు అమితావేశంతో.
ఖంగారు పడ్డ రమేష్ కొంత సేపట్లో సర్దుకున్నాడు, ఓ 10నిముషాలు అయ్యాక మెల్లిగా తలుపు తెర్చుకుంది మిశ్రా గారు బయటికొచ్చారు భాగ్యలక్ష్మీ బంపర్ లాటరీ తగిలిన వాడిలా మొహం పెట్టి.ఇప్పుడాయన మొహం లో పంచవర్ణాలు లేవు మంచి తేజోవంతంగా వెలిగిపోతోంది.

ఎందుకంత గాభరా పడ్డారు ఏమయ్యింది అని రమేష్ అమాయకంగా అడిగితే మిశ్రా గారు చెప్పిందేంటంటే...
ఆయన ఇందాకట్నించీ యూరినల్స్ కి వెళ్ళాలి అందుకు టాయిలెట్ గురించి వెతుక్కుంటున్నాడు ఎక్కడుందో తెలీక.ఆ రోజు శుక్రవారం సెలవురోజు కావడం తో అన్ని రూం తలుపులూ దగ్గరగా వేసేసి ఉన్నాయి, ఏ తలుపుల మీదా నేంబోర్డుల్లేవు, పైగా అన్ని తలుపులూ ఒకేలా ఉండడంతో ఆయన కంఫ్యూజ్ అయ్యారట, ఏతలుపులు తీసుకుని వెళ్ళాలో తెలీక అందుకే పై ఫ్లోర్ లో, కింద ఫ్లోర్ లో, ఈ ఫ్లోర్ లో మొత్తం ఆఫీసంతా తిరుగుతూ ఉన్నాట్ట ఇందాకట్నించీ. అన్ని తలుపులూ క్లోజ్ చేసి ఉన్నాయి, అదే ఆఫీసున్న రోజుల్లో అన్ని తలుపులూ తీసి ఉంటాయి కదా ఏ తలుపు మూసి ఉందో అదే టాయిలెట్ అని బండ గుర్తు పెట్టుకున్నాట్ట మిశ్రా గారు. అందుకని గాభరాగ తిరుగుతున్నాట్ట అదీ ఆయన చెప్పిన నిప్పులాంటి నిజం. (అసలు పక్కనే ఉన్న టాయిలెట్ తలుపొదిలేసి మొత్తం ఫ్లోర్లో ఉన్న తలుపులన్నీ వెతుక్కుంటూ ఉన్నాడన్నమాట ఆయన).
అయ్యా అదీ విషయం.ఈ సారి మరోకొత్త ఝలక్కుతో కలుద్దాం.
మా మిశ్రా గారి చాతుర్యం (Part-1)ఇక్కడ చదవండి ...
3 వ్యాఖ్యలు:
ఇప్పుడే రెండు పార్టులూ చదివేశానండీ.. సీరియల్ బాగుంది.. కొనసాగించండి, ఇదే ఫ్లో లో...
ha ha :)
హిహిహి
మిశ్రా గారి అవతారం
భాగ్యలక్ష్మీ బంపర్ లాటరీ తగిలిన వాడిలా మొహం పెట్టి.ఇప్పుడాయన మొహం లో పంచవర్ణాలు లేవు మంచి తేజోవంతంగా వెలిగిపోతోంది :) కేక
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి