కానీ కొన్ని ఎడ్వర్‌టైజ్‌మెంట్లు చూస్తుంటే ముచ్చటేస్తుంది,ఒక్కోసారి ఆ వస్తువు వెంటనే కొనెయ్యాలనిపిస్తుంది కూడా. అలాంటి వాటిల్లో నాకు నచ్చినవి ఓ రెండు మూడు ఏడ్స్.
కొన్నాళ్ళ క్రితం వచ్చిన "కెల్వినేటర్ ద కూలెస్ట్ వన్" (ఫ్రిజ్‌లు), కెల్వినేటర్ వారి బిజినెస్ గ్రాఫ్ పైపైకి తీసుకెళ్ళింది.
ఆ తర్వాత వచ్చిన బజాజ్‌కవాసాకి బైక్ 'చీతా పరిగెత్తుతూ బైక్ లాగ మారుతుంది".అసలు ఆ కాన్సెప్టే ఒక అద్భుతం అప్పట్లో.బజాజ్ వారి ప్రోడక్ట్స్ లొ అంతకు ముందొచ్చిన అదే బైక్ ఫెయిల్ అయింది ఆ తర్వాత కొన్ని మార్పులూ చేర్పులూ చేసాక దానికి ఈ ఏడ్ కేంపైన్ ఇచ్చిన బిజినెస్ వార్ని నష్టాల్లోంచి బయటపడేసింది మరి కొన్ని కొత్త మోడల్స్ కి రూపకల్పన చేయడానికి పురికొల్పింది కూడా.
అలాగే అమూల్ వారి చాక్లేట్ ఏడ్ "ఎ గిఫ్ట్ ఫర్ సంవన్ హూ లవ్స్ యూ" ఎప్పటికి మధురానుభూతులు పంచుతూనే ఉంటుంది.
స్వామి కార్యం స్వకార్యం లాగ అవతలి వారి వస్తువుకి ప్రచారం కల్పిస్తూనే ఈ ప్రచారం చెయ్యడం కూడా ఒక వ్యాపారం లాగ అయింది.అందుకే పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇందులోకి అడుగుపెట్టాయి పుష్కలంగా సంపాదించడానికి.కాకపోతే ఎవడికి కోపం వచ్చినా ఊడేది లోకువగా ఉన్నవాడి పన్నే అని.
అసలు విషయానికొస్తే పాత మెయిల్స్ చెక్ చేస్తుంటే కంటపడింది ఈ ఎటాచ్‌మెంట్, మీ కోసం ఇక్కడ ఉంచుతున్నా. ఈ కిందన ఉన్న బొమ్మలో చూడండి ఎంత చక్కగా ఏడ్ ఇచ్చారో "నేషనల్ అసొసియేషన్ ఫర్ బ్లైండ్" సంస్థ వారు మీ కళ్ళు దానం చెయ్యండి ఇంకొకరికి దృష్టిని ప్రసాదించండి అని. మౌనంగా ఎంత భావాన్ని పలికించారో గమనించండి,ఎడ్వర్‌టైజ్‌మెంటుకున్న శక్తి అటువంటిది మరి.
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం”
6 వ్యాఖ్యలు:
మీరు చెప్పింది నిజం. సినిమాల కంటే ఇందులో క్రియేటివిటీ బాగా అనిపిస్తుంది. మనసుకు హత్తుకునేలా యాడ్ తీయడం ఒక కళ.
పై యాడ్ చాలా బావుంది.
పై యాడ్ నిజంగానే చాలా బావుంది . సింపుల్ గానూ ...మనసుకు హత్తుకొనే లాగానూ ...
మంచి ఏడ్స్ చూడడం నాకెప్పుడూ ఇష్టంగానే ఉంటుంది. ఈ మధ్య వచ్చిన వాటిల్లో నాకు బాగా నచ్చినవి వోడాఫోన్ జూజూ ఏడ్స్. పైన చెప్పిన ఏడ్ చాలా బాగుంది.
చాల బావున్నాయి
బ్లాగులోకానికి పునః స్వాగతం
చక్కటి యాడ్ అండి..నాకు సిడ్నీలో ఉండగా బాగా నచ్చిన యాడ్ [ఒక విధంగా మా పిల్లలకి బనానా అంటే ఇష్టం కలిగించిన] నాకిప్పటికీ అరటి పండు చూస్తే నోట్లో కదలాడే పాట ఇది.
banana banana banaanaa..makes those bodies sing..విడీయో క్లిప్ ఇది.. http://www.youtube.com/watch?v=J03R_62la4g
అలాగే మరొకటి - రకరకాల పళ్ళు మిక్సీలో వేసి గ్లాసులోకి వంపితే బనానా పడుతుంది..అంటే అంత మంచి ఫలం అని.
అలాగే ఇక్కడ/అమెరికాలో పాలకి Milk It అని మాగజీన్స్ లో వచ్చే యాడ్ కూడా బావుంటుంది.
చక్కగా ఉందండీ మీరెంచుకున్న అంశము మరియు చెప్పిన విధానము. నిజమే మరి అయిదు పైసల (అంటే ఇప్పుడు అయిదు పైసలకేమీ రావడం లేదనుకోండి) నించి యాభై కోట్ల దాకా ఏది కొనాలన్నా ఈ అయిదు సెకన్ల యాడ్ని చుసేగా మరి కొనేది. క్రొత్త వస్తువు వచ్చిందన్నా కూడా ఇలానే కదా తెలిసేది!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి